Andhra Pradesh : నేడు అసెంబ్లీలో మెడికల్ కళాశాలలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. మెడికల్ కళాశాలలపై చర్చ జరగనుంది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఉదయం శాసనసభ, శాసనమండలి ప్రారంభమవుతాయి. ఈరోజు కీలక బిల్లులను ప్రభుత్వం ఆమోదించే అవకాశముంది. సభ ప్రారంభమయిన ప్రశ్నోత్తరాలు ఉంటాయి. తర్వాత జీరో అవర్ కూడా ఉంటుంది. జీరో అవర్ లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు నోట్ చేసుకుని తర్వాత సమాధానాన్ని లిఖితపూర్వకంగా పంపుతారు.
చంద్రబాబు వివరణ...
తర్వాత ఈరోజు మెడికల్ కళాశాలలపై శాసనసభ సమావేశాల్లో చర్చ జరగనుంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రయివేటు పరం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పీపీపీ పద్ధతిలో ప్రయివేటు వ్యక్తులకు మెడికల్ కళాశాలలను అప్పగిస్తుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలపై ప్రసంగిస్తారు. ప్రజలకు వివరిస్తారు.