Andhra Pradesh : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమాశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

Update: 2025-02-23 02:25 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమాశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పయ్యావుల కేశవ్ ఈ సమావేశాల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ను ఈ నెల 28వ తేదీన ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. సాధారణ బడ్జెట్ తో పాటు వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనుంది. తొలిరోజు ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.

28న బడ్జెట్...
బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 25వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనుంది. 26వ తేదీన శివరాత్రి, 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో ఈ నెల 28న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.


Tags:    

Similar News