Andhra Pradesh : ఆగస్టు రెండో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు?
ఆగస్టు రెండో వారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
ఆగస్టు రెండో వారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. వర్షాకాల సమావేశాలను ఆగస్టు రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇంకా తేదీలు ఖరారు కాకపోయినా ఆగస్టు రెండో వారంలోనే సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అప్పటికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమం పూర్తి అవుతుండటంతో రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు.
ఏడాది కాలంలో...
ఈ వర్షాకాల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది గడుస్తున్న సందర్భంగా అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి గురించి ప్రధానంగా చర్చించే అవకాశముంది. దీనిపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు బనకచర్ల ప్రాజెక్టుపై కూడా ఈ సమావేశాల్లో క్లారిటీ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించనుంది.