Andhra Pradesh : ఎనిమిదో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. బడ్జెట్ సమావేశాలు కావడంతో అధికార కూటమికి చెందిన సభ్యులు ప్రసంగాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ బహిష్కరించడంతో అధికారపార్టీ మాత్రమే బడ్జెట్ పై జరిగే చర్చల్లో పాల్గొంటుంది. అదే సమయంలో శాసనమండలిలో మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
కీలక ప్రకటన...
దీంతో శాసనమండలి కొంత హాట్ హాట్ గా సాగుతుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు, పది గంటలకు శానసమండలి సమావేశాలు ప్రారంభం కాన్నాయి. ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభయిన తర్వాత భూముల అమ్మకాలు, తనఖాపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన నేడు చేయనున్నారు. అలాగే శాసనమండలిలో మాత్రం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇవ్వనున్నారు.