Andhra Pradesh : నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు.. ఏమున్నాయంటే?
ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. వివిధ కీలక బిల్లులను సభ ఆమోదం తెలిపే అవకాశముంది.
Ap 2024 budget meeting today
ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. వివిధ కీలక బిల్లులను సభ ఆమోదం తెలిపే అవకాశముంది. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీలు, సాగునీటి కాల్వల నిర్వహణ, ఆక్వా రైతులపై పన్ను విధింపు, విద్యార్దులకు ఆర్ధిక సహాయం, కడప జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు వాహనాల పంపిణీ, ఐటీడీఏ ప్రాజెక్టు పాడేరు, పాలేరు నియోజకవర్గంలో అడవిపల్లి ప్రాజెక్ట్, చేనేత కార్మికులకు ప్రోత్సాహకాలు, కార్మిక సంక్షేమం మండలి, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకం వంటి అంశాలకు సంబంధించి మంత్రులు వివరిస్తారు.
స్వల్పకాలిక చర్చలు...
అనంతరం ఆంధ్రప్రదేశ్ కో - ఆపరేటివ్ సొసైటీస్ చట్ట సవరణ బిల్లు -2024, ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు -2024, ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ చట్టసవరణ బిల్లు- 2024, - ఆంధ్రప్రదేశ్ ఇండియా మెడ్ లిక్కర్, ఫారన్ మెడ్ లిక్కర్ చట్ట సవరణ బిల్లు-2024, రుషికొండపై భవనాలు నిర్మాణంపై స్వల్ప కాలిక చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్, ఇతర సాగునీటి ప్రాజెక్ట్ లపై స్వల్పకాలిక చర్చ కూడా నేడు జరుగుతుంది. ఈరోజు సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు.