Andhra Pradesh : నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు.. తెలుసుకోవడమిలా
ఆంధ్రప్రదేశ్ లో నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నాయి. బుధవారం ఉదయం పది గంటలకు ఫలితాలను విద్యాశాఖ విడుదల చేయనుంది. పదో తరగతి పరీక్ష ఫలితాలతో పాటు ఓపెన్ స్కూల్ లో పదో తరగతి, ఇంటర్ ఫలితాలను కూడా నేడు విద్యాశాఖ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు https://bse.ap.gov.in తో పాటు https://apopenschool.ap.gov.in/ లో కూడా చూసే అవకాశం ఉంది.
ఈ నెంబరుకు...
అదేసమయంలో 9552300009 నెంబరుకు హాయ్ అని మెసేజ్ పంపి పరీక్ష ఫలితాలను మొబైల్ లో పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పదోతరగతి పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. నేడు ఫలితాలు వస్తుండటంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.