పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలెన్నంటే?
ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి
ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మే 19 నుంచి 28 వరకు ఫెయిల్ అయినవారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 81.14శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. బాలికలే అత్యధిక శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఈ వెబ్ సైట్ లో...
ఈ ఏడాది పదోతరగి పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. వంద శాతం ఫలితాలు 1680 పాఠశాలలు సాధించినట్లు ప్రాధమిక విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఫలితాల కోసం https://bse.ap.gov.in తో పాటు https://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్ లో చూడవచ్చు. 9552300009 నెంబరుకు హాయ్ అని మెసేజ్ పంపి పరీక్ష ఫలితాలను మొబైల్ లో పొందవచ్చు