వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి కరోనా సోకింది. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Update: 2022-01-24 06:19 GMT

అనంతపురం వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి కరోనా సాకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు కనపడటంతో ఆయన కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది.

స్వల్ప లక్షణాలు....
అనంత వెంకట్రామిరెడ్డి కొన్ని రోజుల నుంచి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తనను వారం రోజుల నుంచి కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అనంత వెంకట్రామిరెడ్డి కోరారు. వైద్యుల సూచన మేరకు ఆయన ప్రస్తుతం హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు.


Tags:    

Similar News