నేడు తురకపాలెంలో ఐసీఏఆర్ బృందం
నేడు తురకపాలెంలో ఐసీఏఆర్ బృందం పర్యటించనుంది. మట్టి నమూనాలు ఐసీఏఆర్ బృందం సేకరించనుంది
నేడు తురకపాలెంలో ఐసీఏఆర్ బృందం పర్యటించనుంది. మట్టి నమూనాలు ఐసీఏఆర్ బృందం సేకరించనుంది. గుంటూరు జిల్లా తురకపాలెంలో గత నెల రోజుల నుంచి ముప్ఫయి మందికి పైగా మరణించారు. మరణించిన వారంతా యువకులు కావడంతో మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయన్నది ఇంత వరకూ అర్థం కాకుండా ఉంది.
మరణాలకు కారణం...
దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఇప్పటికే తురకపాలెంలో ఎయిమ్స్ బృందం పర్యటించింది. గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించిన వైద్య సిబ్బంది వాటిని పరీక్షలకోసం పంపారు. తురకపాలెం గ్రామానికి చెందిన నలుగురికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణాలకు గల కారణాలపై నేడు ఐసీఏఆర్ బృందం పర్యటించినుంది.