కోనసీమ - పశ్చిమ గోదావరి జిల్లాలకు రాకపోకలు బంద్
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి వరద ముంచెత్తింది. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి వరద ముంచెత్తింది. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పి.గన్నవరం మండలం కనకాయ లంక కాజ్‌వే పైకి వరద నీరు చేరింది. దీంతో కోనసీమ - పశ్చిమ గోదావరి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవలపై ప్రయాణం కొనసాగించాల్సి వస్తుంది.
పడవపైనే...
అయినవిల్లి, ఎదురుబిడియం, అప్పనపల్లి కాజ్‌వేల వరద నీరు పైకి చేరుతుండటంతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. గంటి పెదపూడి దగ్గర గోదావరి నదిపై తాత్కాలిక గట్టు తెగిపోయింది. గత మూడు నెలలుగా పడవలపై నాలుగు గ్రామాల ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు వరద ఉధృతికి కాజ్‌వేలు నీటమునిగాయి. ఇప్పుడు మరోసారి కాజ్‌వేలు నీట మునుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.