చంద్రబాబుపై ఒవైసీ కీలక కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు

Update: 2025-06-15 04:29 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వల్లనే లోకేశ్ రాజకీయంగా ఎదగలేకపోతున్నారని అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ బిల్లులను అడ్డుకోవాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని చెప్పారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ పై కూడా అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు.

పవన్ పై కూడా...
పవన్ సినిమాల్లో హీరో కావచ్చు కానీ, తాను అంతకంటే పెద్ద హీరోనని తెలిపారు. ముస్లింల అభివృద్ధికి, సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ తూట్లు పొడుస్తున్నప్పటికీ వీరిద్దరూ సహకరించడాన్ని ఒవైసీ తప్పుపట్టారు. జీవితంలో శాశ్వతంగా ఎవరూ ఉండరని, వారు తీసుకున్న నిర్ణయాలు పర్మినెంట్ గా ఉండిపోతాయని తెలిపారు. రాజకీయంగా ఎదిగిన పెద్ద పెద్ద నేతలు కనమరుగవుతున్నారని కూడా అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.


Tags:    

Similar News