వైసీపీపై అచ్చెన్న ఆగ్రహం.. సభకు రాకుండా?
వైసీపీ వ్యవహారశైలిపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు
వైసీపీ వ్యవహారశైలిపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. అన్ని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతిపక్ష హోదా లేదనే నెపంతో అసెంబ్లీకి రాకపోవడం సరికాదని అన్నారు. యూరియా కొరత లేకుండా రైతులను ఆదుకున్నామన్న అచ్చెన్నాయుడు యూరియా సహా అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
తప్పుడు ప్రచారాలు మానుకోవాలంటూ...
తప్పుడు ప్రచారాలు మానుకోవాలని వైసీపీ నాయకులకు గట్టిగా చెబుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కుంటిసాకులతో వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం ఎంతవరకు సమంజసమని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఏ విషయంలోనైనా ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉందని చెబుతున్నప్పటికీ సభ్యులు రాకపోవడంపై ఆయన విమర్శలు చేశారు.