జగన్ ది విధ్వంస యాత్రే : అచ్చెన్నాయుడు

జగన్ పర్యటన సినిమాసెట్టింగ్‌ మాదిరిగాఉందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు

Update: 2025-07-09 12:04 GMT

జగన్ పర్యటన సినిమాసెట్టింగ్‌ మాదిరిగాఉందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ లేని సమస్యను సృష్టించేందుకు జగన్ పర్యటనలు చేస్తున్నారన్నారు. అన్నమయ్య జిల్లాల్లో 99 శాతం మామిడి కొనుగోళ్లు పూర్తయ్యాయన్న అచ్చెన్నాయుడు పరిష్కారం కోసం కాదు..ప్రచారం కోసమే వాళ్ల ఆరాటమని, జనసమీకరణ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. డబ్బులు ఖర్చు పెట్టి మరీ జనాలను తీసుకొస్తున్నారని అన్నారు.

వైసీపీకి చెందిన రైతుకు...
ఆరు కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్‌కు అనుమతి కావాలన్నారని, వంద మీటర్ల దూరంలో అనుమతి ఇస్తామంటే ఒప్పుకోరని తెలిపారు. హెలిప్యాడ్ దగ్గరకు వచ్చి విధ్వంసం చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. క్రిమినల్ ఆలోచనలు, సెట్టింగ్‌లతోనే ఇలాంటి కార్యక్రమాలు చేశారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ నేతకు చెందిన పొలంలో పండిన మామిడి పండ్లను తెచ్చి రోడ్లపైకి పోసి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు నటించారని, జగన్ విపక్షంలో ఉండి కూడా విధ్వంసాన్ని సృష్టించేలా ప్రవర్తిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.


Tags:    

Similar News