వైఎస్ఆర్, బాలయోగి తర్వాత.. మరో ప్రముఖ రాజకీయ నాయకుడు
అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కన్నుమూశారు.
ప్లేన్ క్రాష్
అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కన్నుమూశారు. ఆయన గుజరాత్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖ నేతల్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి ఉన్నారు.
2002 లో ఛాపర్ ప్రమాదంలో బాలయోగి మరణించారు. సెప్టెంబర్ 2, 2009న హైదరాబాద్ నుండి బయలుదేరిన తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలో వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. మరో గుజరాత్ ముఖ్యమంత్రి బల్వంతరాయ్ మెహతా 1965 భారత్-పాకిస్తాన్ యుద్ధం సమయంలో జరిగిన వైమానిక ప్రమాదంలో మరణించారు. ఆయన తన కుటుంబంతో ప్రయాణిస్తూ ఉండగా పాకిస్తాన్ యుద్ధ విమానం పొరపాటున కూల్చివేసింది.