నేడు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు

ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణాంధ్ర జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

Update: 2022-07-09 02:15 GMT

ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణాంధ్ర జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉపరితల ఆవర్తనం, రుతు పవన ద్రోణి ప్రభావంతో ఇప్పటికే ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రాయలసీమలోనూ...
కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. రాయలసీమలో సయితం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు జల్లులు, మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి. కార్యాలయాలు విడిచిపెట్టే సమయంలో వర్షం కురవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు.


Tags:    

Similar News