Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ దాడులు

ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి

Update: 2025-12-23 06:55 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలోని చిలమత్తూరులో ఏసీబీ దాడులు జరుపుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ ఇంటితో పాటు ఆయన వద్ద పనిచేసే వ్యక్తి ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు బృందాలుగా విడిపోయి చిలమత్తూరు, అనంతపురంలలో సోదాలు జరుపుతున్నారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో...
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రయివేటు వ్యక్తిగా ఉన్న సోమశేఖర్ ఇంట్లోనూ సోదాలు జరుపుతున్నారు. పెద్దయెత్తున లావాదేవీలు జరిగాయని, ఈ లావాదేవీల విషయంలో భారీగా సొమ్ము చేతులు మారినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. మరొకవైపు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోనూ ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ ఇల్లు, సంబంధించిన సన్నిహితులపై సోదాలు నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News