ఏపీ సర్కార్ కు మరో ఆటంకం... జిల్లాల విభజన హైకోర్టుకు

ఏపీ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. జిల్లాల విభజన రాజ్యాంగ విరుద్ధమని ఆశ్రయించారు

Update: 2022-03-13 01:02 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. జిల్లాల విభజన రాజ్యాంగ విరుద్ధమంటూ హైకోర్టును ఆశ్రయించారు. రేపు హైకోర్టు ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా కోరింది. వచ్చే ఉగాది నుంచి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఆ అధికారం లేదంటూ.....
ఈ నేపథ్యంలో గుంటూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలకు చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు. కొత్త జిల్లాలపై జనవరి 25న ప్రభుత్వం తీసుకువచ్చిన ముసాయిదా నోటిఫికేషన్, అనంతరం విడుదల చేసిన జీవోలు ఆర్టికల్ 371కు విరుద్ధమని పిటీషినర్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జిల్లాలను మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని వారు తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులను మార్చకుండా జిల్లాలను విభజన సాధ్యం కాదని చెప్పారు. నియామకాల్లో జిల్లా, జోనల్ వ్యవస్థలకు అదే ప్రధానమని పేర్కొన్నారు. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు రేపు విచారణ జరపనుంది.


Tags:    

Similar News