29.510 కిలోల దుర్గమ్మ బంగారం

శ్రీదుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి చెందిన 29.510 కిలోల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేశారు అధికారులు.

Update: 2025-07-08 10:15 GMT

శ్రీదుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి చెందిన 29.510 కిలోల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేశారు అధికారులు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గాంధీనగర్‌ బ్రాంచ్‌లో బంగారాన్ని ఉంచారు. డిపాజిట్‌పై సంవత్సరానికి 0.60 శాతం వడ్డీ లభిస్తుందని ఈవో శీనానాయక్‌ తెలిపారు. డిపాజిట్‌ చేసిన బంగారం విలువ 26.58 కోట్ల రూపాయలు ఉంటుంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని కానుకలు చెల్లించి మొక్కులు తీర్చుకుంటుంటారు.

Tags:    

Similar News