2 కిలోల పులస.. వేలంలో ఎంత ధర పలికిందో తెలిస్తే షాకవుతారు

గోదావరికి వరద ఉద్ధృతి తగ్గడంతో మత్స్యకారులకు వలల్లోకి పులస చేపలు చిక్కుతున్నాయి. యానాం మార్కెట్లో పులస విక్రయాలు

Update: 2022-08-24 06:28 GMT

సముద్రంలో ఉన్నపుడు ఇలసగా ఉండే చేప.. సముద్రంలో నుంచి గోదావరికి ఎదురీదుతూ వెళ్లి పులసగా మారుతుంది. ఇలస కంటే.. పులసే రుచిగా ఉంటుంది. పులస చేప రుచి చూసిన వారు.. జీవితంలో మరిచిపోలేరు. అందుకే వాటికి అంత గిరాకీ మరి. పుస్తెలు అమ్మైనా పులస తినాలన్న సామెత గోదావరి జిల్లాల్లో నానుడి. గోదావరి జాలర్ల వలలో పులస పడిందంటే వారి పంట పండినట్లే. పులస ఎక్కువగా దొరికే సీజన్ వర్షాకాలం. ఈ సీజన్లో పులస కోసం వందల వేలమంది క్యూ కడుతుంటారు. మిగతా చేపల కంటే పులస ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దానిని ఒక్కరికే అమ్మలేక వేలంపాటలు నిర్వహిస్తుంటారు.

గోదావరికి వరద ఉద్ధృతి తగ్గడంతో మత్స్యకారులకు వలల్లోకి పులస చేపలు చిక్కుతున్నాయి. యానాం మార్కెట్లో పులస విక్రయాలు మొదలయ్యాయి. తాజాగా ఓ మహిళ పులస చేపను ఎంతకు కొనిందో తెలిస్తే గుండె గుభేల్ మంటుంది. నిన్న యానాం మార్కెట్లో 2 కిలోల పులస చేపను వేలం వేయగా.. కనీవినీ ఎరుగని రేటుకు అమ్ముడైంది. పార్వతి అనే మహిళ ఈ చేపను రూ.19వేలకు దక్కించుకుని భైరవపాలేనికి చెందిన వ్యక్తికి రూ.20 వేలకు అమ్మేసింది. ఈ సీజన్లో పులసకు అత్యధిక వేలం పలకింది ఇదేనని మత్స్యకారులు చెబుతున్నారు.



Tags:    

Similar News