Tirumala : నేడు తిరుమలకు వెళుతున్నారా.. అయితే ఇది మీకోసమే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. తిరుమలకు భక్తుల రద్దీ తగ్గడం లేదు. అయితే దిత్వా తుపాను ప్రభావం ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో శనివారం ఉండాల్సినంత రీతిలో భక్తుల రద్దీ కనిపించడం లేదు. తుపాను ప్రభావం తిరుపతి, చిత్తూరు జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని భావించి భక్తులు తిరుమలకు ఎక్కువ సంఖ్యలో చేరుకోలేదని అంటున్నారు. అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదని, హుండీ ఆదాయం కూడా బాగానే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఎల్లుండి సాయంత్రం వరకూ...
ఇక వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆన్ లైన్ లో రిజి్స్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఎల్లుండి సాయంత్రం ఐదు గంటల వరకూ భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికే ఆరు లక్షల మందికిపైగా భక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. డిసెంబరు 2వ తేదీన లాటరీ పద్ధతిలో వైకుంఠ ద్వార దర్శనాలను తేదీల వారీగా భక్తులకు టీటీడీ కేటాయించనుంది. డిసెంబరు 30వ తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది.
పద్దెనిమిది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పద్దెనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,044 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,559 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.47 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.