Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. తిరుమలకు భక్తుల రాక తగ్గడం లేదు. ఈ రద్దీ జనవరి నెల సంక్రాంతి సెలవుల వరకూ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే నెలలోనూ, జనవరి నెలలోనూ పండగలు ఉండటంతో పాటు సెలవులు కూడా వస్తుండటం, వైకుంఠ ద్వార దర్శనం వంటి వాటికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని భావించి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వకుంఠ ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.
నేడు కూడా ఆర్జిత సేవా టిక్కెట్లు...
తిరుమలలో ప్రస్తుతం ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్ల కేటాయింపు జరుగుతంది. రేపు ఉదయం పది గంటలకు లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవా టిక్కెట్లను రిజర్వేషన్ చేసుకునే అవకాశముంటుంది. రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లను కేటాయింపు జరగుతుంది. ఇందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆర్జిత సేవా టిక్కెట్లను బుక్ చేసుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. అలాగే నేడు తిరుమలకు వచ్చిన భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నట్లు చెప్పారు.
పదిహేడు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని పదిహేడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ ద్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 66,966 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,535 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.19 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.