Tirumala : తిరుమలకు నేడు వెళ్లే వారు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు

Update: 2025-11-24 03:12 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు. తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో టీటీడీ అధికారులు వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం నాటి రద్దీ సోమవారం కూడా సహజంగానే కొనసాగుతుంది. తిరుమలకు వచ్చిన వారు కేవలం శ్రీవారిని దర్శించుకోవడమే కాకుండా ఏడుకొండలపై ఉన్న వివిధ ప్రాంతాలను దర్శించుకునేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. జాపాలి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

హుండీ ఆదాయం కూడా...
తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో హుండీ ఆదాయం కూడా గణనీయంగానే పెరిగింది. గతంలో కంటే రోజుకు నాలుగు కోట్ల రూపాయల వరకూ హుండీ ఆదాయం వస్తుంది. కేవలం నగదు రూపంలోనే కాకుండా విరాళాల రూపంలో టీటీడీకి అందేవి కూడా కోట్ల రూపాయల్లోనే ఉన్నాయి. ఆధ్మాత్మికత పెరగడంతో శ్రీవారి ఏడాది ఆదాయం కూడా భారీగా పెరిగింది. దీంతో పాటు తిరుమలకు వచ్చే భక్తులకు అవసరమైన అన్న ప్రసాదాలను, లడ్డూ తయారీలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తగినంతగా చేస్తున్నారు.
ఇరవై ఐదు కంపార్ట్ మెంట్లలో ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఇరవై ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 78,974 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,995 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.61 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News