Tirumala : తిరుమలకు నేడు వెళ్లే వారికి సూచనలివే

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారమయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది

Update: 2025-11-26 03:24 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారమయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గత కొద్దిరోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ప్రారంభమయిన భక్తుల రద్దీ ఈరోజు కూడా కొనసాగుతుంది. తిరుమలకు సంబంధించిన విషయంలో భక్తులు ఒక సీజన్ తో సంబంధం లేకుండా వస్తుండటంతో నిత్యం కొండ కళకళలాడుతూనే ఉంది. గతంలో కేవలం వేసవి కాలంలోనే తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అన్ని రోజుల్లోనూ భక్తులు తిరుమలకు వచ్చి ఏడుకొండల వాడిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

రేపటి నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి...
తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి రేపటి నుంచి డిసెంబరు 1వ తేదీ వరకూ ఆన్ లైన్ లో భక్తులు ముందస్తుగా నమోదు చేసుకోవాలి. డిప్ ద్వారా ఉచిత సర్వ దర్శన టోకెన్లు వారికి కేటాయించనున్నారు. తిరుమలలో వైకుంఠం ద్వార దర్శనం డిసెంబరు 30వ తేదీ నుంచి జనవరి ెనిమిదో తేదీ వరకూ నిర్వహించనున్నారు. మొత్త పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతాయి. పది రోజుల పాటు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి సామాన్య భక్తులకు అవకాశం కల్పించనున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇరవై మూడు కంపార్ట్ మెంట్లలో
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం నేడు పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకుపైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,677 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,732 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.26 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News