Andhra Pradesh : మెడికల్ కళాశాలలకు స్పందన కరువు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య కళాశాలలకు నిర్వహించిన టెండర్లకు స్పందన కనిపించలేదు.

Update: 2025-12-24 03:52 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య కళాశాలలకు నిర్వహించిన టెండర్లకు స్పందన కనిపించలేదు. తక్కువ స్పందన మాత్రమే కనిపించింది. పీపీపీ విధానంలో వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పిలిచిన టెండర్లకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. తొలి విడతలో ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందులలో కళాశాలలను పీపీపీ మోడల్లో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ టెండర్లు పిలిచింది.

టెండర్లు గడువు పొడిగించినా...
టెండర్ల గడువును ఇప్పటికే రెండు సార్లు పొడిగించినప్పటికీ ఆదోని కళాశాలకు మాత్రమే ఒక్క బిడ్ దాఖలైంది. దీనికి గల కారణాలపై చర్చిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. కేవలం ఒక్క బిడ్ మాత్రమే దాఖలు కావడంతో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరొకవైపు గడువు మరొకసారి పెంచాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది.


Tags:    

Similar News