Andhar Pradesh :ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు కీలక పరిణామం?

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశముంది

Update: 2025-11-12 02:48 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశముంది. ప్రధాన నిందితులకు సంబంధించిన బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే చాలా మందికి బెయిల్ లభించింది. అయితే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, నవీన్, బాలాజీ యాదవ్ లకు బెయిల్ లభించలేదు.

నిందితుల బెయిల్ పిటీషన్ పై...
వీరంతా కొన్ని నెలలుగా రిమాండ్ ఖైదీలుగా విజయవాడ జైలులో ఉంటున్నారు. అనేక మార్లు బెయిల్ పిటీషన్లు వేసినా ఏసీబీ న్యాయస్థానం తిరస్కరించింది. అయితే నేడు జరగనున్న విచారణలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు బెయిల్ లభిస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉత్కంఠ నెలకొంది.


Tags:    

Similar News