Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్ లో దంచి కొడుతున్న వర్షం.. మరో ఆరు గంటలు వానలే వానలు
మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీగా వర్షాలు పడుతున్నాయి
క్రమంగా 'మొంథా' తుపాను బలహీనపడుతుంది. తుపానుగా బలహీనపడ్డ తీవ్ర తుపాన్ రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో నేడు రాష్ట్రంలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. అయితే కోస్తాంధ్ర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరిసీతారామరాు, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడతాయని చెప్పింది.
ఈ జిల్లాల్లో...
కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈదురుగాలులు కూడా బలంగా వీస్తాయని, గంటకు అరవై నుంచి డెబ్భయి కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నందును ఎవరూ వీలయినంత వరకూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు కోరుతున్నారు. వాగులు, నదులు దాటే ప్రయత్నం ఎవరూ చేయవద్దని, అలాగే ప్రయాణాలు కూడా వీలయినంత మేరకు మానుకోవాలని సూచించింది.
ఈదురుగాలులు వీస్తూ...
మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. గాలుల తీవ్రత కూడా పెరిగింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. తుపాన్ ప్రభావంతో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. తీర ప్రాంతాల్లో పలు చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. తుపాన్‌గా బలహీనపడుతున్న మొంథా రానున్న ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాకఖ తెలపింది. ఆంధ్రప్రదేశ్ లోని 12 జిల్లాలకు భారీ వర్ష సూచన చేింది. తొమ్మిది జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచనచేసిదంి.