Andhra Pradesh : అంతర్వేది వద్ద పరిస్థితి ఇలా
కోనసీమ జిల్లా అంతర్వేదిలో తీరాన్ని 'మొంథా' తీవ్ర తుపాను తాకడంతో అలలు ఎగిసి పడుతున్నాయి
కోనసీమ జిల్లా అంతర్వేదిలో తీరాన్ని 'మొంథా' తీవ్ర తుపాను తాకడంతో అలలు ఎగిసి పడుతున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అంతర్వేదిలో సముద్రం వద్దకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కార్తీక స్నానాలకు కూడా ఎవరూ దిగవద్దని, సముద్రం అల్లకల్లోలంగా ఉందని అధికారులు తెలిపారు. కాకినాడ, అంతర్వేదిలో ప్రస్తుతం పరిస్థితి భయానకంగా ఉంది.
తుపాను తీరం దాటడంతో...
మచిలీపట్నం-కాకినాడ మధ్య నరసాపురం సమీపంలో తీరం దాటింది. అనంతరం తుపానుగా బలహీన పడింది. దీంతో అంతర్వేది, కాకినాడ తీరాలు క్రమంగా శాంతిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు చోట్ల వర్షం ఆగిపోగా ఈదురుగాలులు భారీగా వీస్తున్నాయి. ఇక నిన్న రాత్రి వరకు తీవ్ర తుపాను కారణంగా 105కిలోమీటర్ల వేగంతో గాలులు వీయగా చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి.