Tirumala : నేడు తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవారిని చూడాలంటే?

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సాధారణ రోజుల కంటే అత్యంత తక్కువగా భక్తుల రద్దీ కనిపిస్తుంది.

Update: 2025-10-30 03:12 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సాధారణ రోజుల కంటే అత్యంత తక్కువగా భక్తుల రద్దీ కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత నాలుగు రోజుల నుంచి భక్తుల రద్దీ తక్కువగా కనిపిస్తుంది. భక్తులు తక్కువగా ఉండటంతో తిరుమలలో శ్రీవారి దర్శనం సులువుగా లభిస్తుంది. భక్తులు వేగంగా, పెద్దగా వేచి ఉండకుండానే స్వామి వారిని దర్శించుకుని కనులారా వీక్షిస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు భారీ వర్షాలు, తుపాను ప్రభావంతో పాటు రైళ్లు, బస్సులు రద్దు కావడంతో రద్దీ తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

హుండీ ఆదాయం...
తిరుమలకు నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. ఇటీవల కాలంలో అంటే గత ఆరు నెలల నుంచి భక్తుల రద్దీ నిరంతరాయంగా కొనసాగుతుంది. మే నెలలో ప్రారంభమయిన భక్తుల రద్దీ మొన్నటి వరకూ కొనసాగింది. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. గతంలో కంటే హుండీ ఆదాయంతో పాటు లడ్డూల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వివిధ ట్రస్టులకు విరాళాలు కూడా ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి.
రెండు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,048 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,838 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.





Tags:    

Similar News