Chandrababu : నేడు నారావారపల్లెలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా వారపల్లెకు కుటుంబ సమేతంగా చేరుకున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా వారపల్లెకు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. చంద్రబాబు నేడు నారావారిలపల్లెలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తన సొంత గ్రామమైన నారా వార పల్లెిలో నేడు జరిగే సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు పాల్గొంటారు. నారావారి పల్లెలోని టీటీడీ కల్యాణ మండపంలో ఈ వేడుకలు జరగనున్నాయి. చంద్రబాబు ఈ పర్యటనలో 140 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలతో పాటు, 20 కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
వివిధ కోట్ల రూపాయలతో చేపట్టిన...
70 లక్షల రూపాయలతో రంగంపేట - భీమరవం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వకూ నిర్మించిన రహదారిని చంద్రబాబు ప్రారంభించనున్నారు. నారావారపల్లెలో 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ ను కూడా చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం 1.4 కోట్ల తో నిర్మిాంచిన స్కిల్ బిల్డింగ్ సెంటర్ ను చంద్రబాబు ప్రారంభించనున్నారు. సంజీవిని ప్రాజెక్టుకు శుభారంభం చేయనున్నారు. దీంతోపాటు మరికొన్ని పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.