Andhra Pradesh : ఏపీలో భోగిమంటల రాజకీయం.. టీడీపీ.. వైసీపీ ఇలా చేశాయిగా?

భోగి పండగ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు కొదవలేదు

Update: 2026-01-14 05:11 GMT

భోగి పండగ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు కొదవలేదు. పండగ నాడు కూడా రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. సాధారణంగా భోగిపండగ రోజు ఆనందోత్సాహాల మధ్య ప్రజలు పండుగను జరుపుకుంటారు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం పండగను కూడా రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు. ఉదయం భోగి మంటలను ఇటు అధికార తెలుగుదేశం పార్టీ, అటు విపక్ష వైసీపీలు రాజకీయ మంటలు రేపాయి. పండగ పూట కూడా ఈ రాజకీయాలేంట్రా బాబూ అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

పట్టాదారు పాస్ పుస్తకాలను...
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు భోగిమంటల్లో గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలను భోగిమంటల్లో వేసింది. దానిపై జగన్ బొమ్మ ఉండటంతో వాటిని అధికారికంగా భావించమని, అందుకే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలను భోగి మంటలను వేసింది. రైతులు, ప్రజలు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో తిరిగి ముద్రించి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నట్లు టీ డీపీ నేతలు ప్రకటించారు.
మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణను...
మరొకవైపు వైసీపీ నేతలు కూడా భోగి నాడు మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణను ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అంశంగా తీసుకుంది. ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా భోగి మంటల్లో దహనం చేశారు. పేదలకు నిలయంగా ఉండాల్సిన ప్రభుత్వ ప్రయివేటు వైద్య కళాశాలలను ప్రయివేటీకరించడం నిలిపేయాలని కోరుతూ వాటిని దహనం చేస్తున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు.



Tags:    

Similar News