మత్స్యకారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్
మత్స్యకారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
మత్స్యకారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మత్స్యకారులకు నలభై శాతం సబ్సిడీతో బోట్లు అందచేయనుంది. త్వరలో ఇంజిన్‌తో కూడిన బోట్లు కూడా అందజేయాలని నిర్ణయించింది. మత్స్యకారులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యల్లో భాగంగా ప్రభుత్వం సబ్సిడీతో ఈ బోట్లను అందచేయాలని నిర్ణయించింది.
ఇరవై వేల ఆర్థికసాయం...
అలాగే చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు రూ.20,000 ఆర్థిక సహాయం కూడా అందచేయనుంది. 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్ అందివ్వాలని నిర్ణయించింది. అర్హులైన మత్స్యకారులు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. అర్హత కలిగిన వారంతా ప్రయోజనాలు పొందుతారని ప్రభుత్వం తెలిపింది.