16వ తేదీన ఏపీకి బిల్ గేట్స్
ఈనెల 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు
ఈనెల 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈనెల 18న వస్తారని తొలుత భావించారు, అయితే రెండు రోజులు ముందుగానే రాష్ట్రానికి బిల్ గేట్స్ వస్తున్నారు. బిల్ గేట్స్ , ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులతో సమావేశం అవుతారు. పలు కీలక అంశాలపై సమీక్ష ఉంటుందని చెబుతున్నారు.
ఒప్పందాలు...
ప్రధానంగా రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఏఐ టెక్నాలజీని అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో బిల్ గేట్స్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఒప్పందం చేసుకోనుంది. బిల్ గేట్స్ వస్తుండటంతో ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గతంలోనూ చంద్రబాబు బిల్ గేట్స్ తో సమావేశమై హైదరాబాద్ కు ప్రతిష్టాత్మకమైన సంస్థలు తీసుకు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.