10 నెలల సస్పెన్షన్ తర్వాత అడుగుపెడుతున్నాడు.. టైటిల్ కొట్టేనా..?

10 నెలల తర్వాత తన తొలి టోర్నీ ఆడుతున్న చైనా బ్యాడ్మింటన్ స్టార్ 'షి యుకీ' సోమవారం టోక్యోలో ప్రారంభమయ్యే

Update: 2022-08-21 15:18 GMT

10 నెలల తర్వాత తన తొలి టోర్నీ ఆడుతున్న చైనా బ్యాడ్మింటన్ స్టార్ 'షి యుకీ' సోమవారం టోక్యోలో ప్రారంభమయ్యే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుని తానేంటో నిరూపించాలనుకుంటున్నట్లు చెప్పాడు. 2015లో మాజీ రియో ​​ఒలింపిక్ ఛాంపియన్ చెన్ లాంగ్ తర్వాత చైనా చివరిసారి పురుషుల సింగిల్స్ కిరీటాన్ని గెలుచుకుని ఏడు సంవత్సరాలు అయ్యింది. 2018లో చైనాలోని నాన్‌జింగ్‌లో ఈవెంట్ జరిగినప్పుడు షి ఫైనల్‌కు చేరుకున్నాడు, అయితే అతను జపాన్‌కు చెందిన కెంటో మొమోటా చేతిలో ఓడిపోయాడు. ఈసారి మాత్రం టైటిల్ గెలవాలని అనుకుంటున్నానని షి యుకీ చెప్పుకొచ్చాడు. "నేను ప్రపంచ టైటిల్ గెలవాలని ఆశిస్తున్నాను, నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను. కానీ ఆ దిశగా వెళ్లాలంటే ప్రతి మ్యాచ్‌ను గెలవాలి. " అని షి యుకీ అన్నాడు. షి చివరి మ్యాచ్ అక్టోబర్ 2021లో థామస్ కప్ సెమీఫైనల్స్‌లో..! అతను 20-22, 5-20తో ఉన్నప్పుడు మ్యాచ్ నుండి వైదొలిగాడు. ఆ తర్వాత అతడు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు చైనీస్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అతన్ని సస్పెండ్ చేసింది. తిరిగి కోర్టులో అడుగుపెట్టడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. గత 10 నెలలుగా నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను.. ఇంకా మంచి ఫామ్ లోనే ఉన్నానని అనుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 25వ స్థానానికి పడిపోయిన 28 ఏళ్ల షి యుకీ టోక్యో మెట్రోపాలిటన్ వ్యాయామశాలలో తన సహచరులు లు గ్వాంగ్జు, జావో జున్‌పెంగ్‌లతో కలిసి 30 నిమిషాల హై-ఇంటెన్సిటీ వర్కౌట్లు చేస్తూ వస్తున్నాడు. నా సహచరులతో అప్పుడప్పుడు కొన్ని మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. "పోటీలు లేని రోజుల్లో, నేను ఎల్లప్పుడూ నా సహచరులతో కొన్ని మ్యాచ్‌లు ఆడుతున్నాను" అని షి యుకీ చెప్పాడు.


Tags:    

Similar News