మాస్టర్ కార్డు బ్రాండ్ అంబాసిడర్లుగా భారత స్టార్స్

మాస్టర్ కార్డు బ్రాండ్ అంబాసిడర్ MS ధోని భారత్ లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు బ్యాడ్మింటన్ స్టార్లు కూడా

Update: 2022-08-20 06:48 GMT

భారతదేశంలో మాస్టర్ కార్డ్ బ్రాండ్ అంబాసిడర్‌లుగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టిలు బాధ్యతలు తీసుకున్నారు. థామస్ కప్ 2022, బర్మింగ్‌హామ్ 2022 కామన్వెల్త్ గేమ్స్ విజేతలుగా నిలిచిన వీరిని మాస్టర్ కార్డ్ బ్రాండ్ అంబాసిడర్‌లుగా నియమించుకుంది. ఈ కొత్త అంబాసిడర్‌లతో భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల భద్రత, సౌలభ్యం గురించి అవగాహన కల్పించడానికి కంపెనీతో భాగస్వామ్యం అయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), డిజిటల్ ఇండియాలకు అనుగుణంగా తాము ముందుకు వెళుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, కంపెనీ తన ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుల ప్యానెల్‌ను మెరుగుపరచడానికి శివ్ కపూర్‌ను కూడా తీసుకుంది. బ్రాండ్ అంబాసిడర్‌గా అనిర్బన్ లాహిరి కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా.. టెన్నిస్ నుండి క్రికెట్ వరకు సాకర్ నుండి ఇ-స్పోర్ట్స్ వరకు క్రీడలలో పెట్టుబడి పెట్టామని.. బ్యాడ్మింటన్ ఇప్పుడు జాబితాలోకి చేర్చబడిందని కంపెనీ తెలిపింది.

మాస్టర్ కార్డు బ్రాండ్ అంబాసిడర్ MS ధోని భారత్ లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు బ్యాడ్మింటన్ స్టార్లు కూడా డిజిటల్ చెల్లింపులపై అవగాహన ఇవ్వనున్నారు. వీరంతా 'టీమ్ క్యాష్‌లెస్ ఇండియా' ప్రచారంలో భాగం అవుతారు. సంస్థకు దక్షిణాసియా విభాగం అధ్యక్షుడు నిఖిల్ సాహ్ని మాట్లాడుతూ "భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల సౌలభ్యం, భద్రత గురించి అవగాహన కల్పించడంపై సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది" అని అన్నారు. లక్ష్య సేన్ మాట్లాడుతూ, "ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో పెరగడం నుండి, భారతదేశాన్ని బ్యాడ్మింటన్‌లో ప్రపంచ వేదికపై నిలబెట్టడం వరకు నేను సాధించగలిగిన దానికి నేను ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. నేను ప్రత్యక్షంగా అనుభవించిన డిజిటల్ చెల్లింపుల ప్రయోజనాలు, సౌలభ్యం, భద్రత గురించి చెప్పడానికి సిద్ధమయ్యాను. డిజిటల్ చెల్లింపుల విషయంలో మిలియన్ల మంది భారతీయుల కోసం పనిచేయడం నాకు గర్వకారణంగా ఉంది" అని చెప్పుకొచ్చాడు.


Tags:    

Similar News