హోదా లేదు..ప్యాకేజీయే మేలు : చంద్రబాబు

Update: 2017-02-03 07:22 GMT

ప్రతి పనినీ రాజకీయం చేయడం తగదని, రాజకీయ కోణంలోనూ చూడటం తగదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అభివ‌ృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు ఇదే పనిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా అనేది సాధ్యం కాదని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ మేలని నిర్ణయించుకుని తాను ప్యాకేజీకి అంగీకరించానన్నారు. విశాఖలో జరిగిన పరిశ్రమల సదస్సులో లక్షల కోట్ల రూపాయల ఎంవోయూలు రావడం ఇందుకు ఉదాహరణ అని చంద్రబాబు చెప్పారు. హోదా అంటూ కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి మాటల మాయలో పడవద్దని యువతకు బాబు హితవు పలికారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు.

స్థానికులకే ఉద్యోగాలు...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. కొండవలూరు మండలం రాచర్ల పాడు వద్ద ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్ లో ఏర్పాటుచేసిన గమేశా విండ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పరిశ్రమ ఇప్పటికే 500 కోట్ల రూపాయల టర్నోవర్ ఉందంటున్నారు. 2019 నాటికి దీన్ని వెయ్యి కోట్ల మేర ఉత్తత్తిని విస్తరించలని భావిస్తున్నారు. స్థానికులకు ఇప్పటికే 500 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. అయితే ఎక్కువగా తమిళనాడుకు చెందిన వారికే ఉద్యోగ అవకాశలు కల్పించడంతో స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఈ పరిశ్రమ ప్రారంభానికి వచ్చినప్పుడు యాజమాన్యంతో మాట్లాడారు. స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

Similar News