IPL 2024 : పొగిడిన నోళ్లే తిట్టిపోస్తున్నాయే.... ఎందుకిలా.. సన్ రైజర్స్ కు ఏమైందబ్బా?

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మీద హైదరాబాద్ సన్ రైజర్స్ ఓటమి పాలయింది

Update: 2024-04-29 04:44 GMT

కొన్ని జట్లు అంతే.. రికార్డుల మోత మోగించిన జట్టు మళ్లీ చతికలపడుతుంది. అతి విశ్వాసమో.. వెనకొచ్చేవాడు కొడతాడేమోనన్న ధీమానో తెలియదు కానీ.. పుంజుకున్న జట్లు కీలక సమయంలో డీలా పడుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పరిస్థితి అలాగే ఉంది. రికార్డుల మోత మోగించిన జట్టు వరస పరాజయాలతో మళ్లీ మొదటికొచ్చింది. అందరి అంచనాలను తలకిందులు చేసేలా జట్టు తీరు ఉందన్న విమర్శలున్నాయి. పొగిడిన వారే తెగ తిట్టేస్తున్నారు. ప్రశంసించిన నోళ్లే తిట్టిపోస్తున్నాయి. అయితే ఇది ఐపీఎల్ కావడంతో చివరి వరకూ ఎవరిది విజయం అన్నది ఎవరికీ చెప్పలేం. అందుకే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు.

మళ్లీ కిందకు ....
సన్ రైజర్స్ హైదరాబాద్ తొలుత తడబడినా తర్వాత వరసగా రికార్డుల మోత మోగించింది. అభిషేక్ శర్మ, హెడ్ ఉంటే చాలు ఎంత స్కోరు అయినా ఊదేస్తారన్న రీతిలో సాగింది. 267, 270, 287 ఇలా వరసగా తన రికార్డులను తానే అధిగమించింది. అందుకే అప్పటి నుంచి ప్రత్యర్థి జట్లు తాము టాస్ గెలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ కు ముందు బ్యాటింగ్ ఇచ్చి తప్పు చేయడం లేదు. మరో రికార్డుకు అవకాశం ఇవ్వడం లేదు. మొన్న బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ మీద, నిన్న చెన్నై సూపర్ కింగ్స్ మీద పోరాడి ఓడిన సన్ రైజర్ హైదరాబాద్ జట్టు మళ్లీ పాయింట్ల పట్టికలో కిందకు పడిపోతుంది. ఇది అభిమానులకు ఆందోళనకు గురి చేస్తుంది.
ఓడిపోయిందిలా...
చెన్నైలో నిన్న జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మీద హైదరాబాద్ సన్ రైజర్స్ ఓటమి పాలయింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. చెన్నైలో రుతురాజ్ గైక్వాడ్ మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 98 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మిచెల్ 52, శివమ్ దూబే 39 పరుగులు చేశాడు. ధోని ఐదు పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్ రైజర్స్ జట్టుకు ఆదిలోనే ఇబ్బందులు తలెత్తాయి. హెడ్ 13 పరుగులకే అవుటయ్యాడు. అభిషేక్ శర్మ 15 పరుగులకే వెనుదిరిగాడు. మిచెల్ ఒక్కడే ఇరవై పరుగులు చేశాడు. మొత్తం 18.5 ఓవర్టలలో ఆల్ అవుట్ అయిన జట్టు 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. 78 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.














Tags:    

Similar News