స్టాలిన్ చేతిలో డీఎంకే పగ్గాలు

Update: 2017-01-04 06:29 GMT

తమిళనాడు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కరుణానిధి కుమారుడు ఎన్నికయ్యారు. ఈరోజు జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా స్టాలిన్ ను ఎన్నుకున్నారు. 48 ఏళ్ల తర్వాత డీఏంకే కు కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కావడం విశేషం. పార్టీ ఆవిర్భావం నుంచి కరుణానిధి పార్టీ అధ్యక్షుడిగానే ఉన్నారు. కరుణకు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ ఎన్నిక అనివార్యమయింది. కొద్ది రోజుల కిందటే స్టాలిన్ ను తన వారసుడిగా కరుణానిధి ప్రకటించారు. అయితే కరుణ కుమార్గె కనిమొళికి కూడా పార్టీలో కీలక పదవి అప్పగిస్తారని భావించారు. ఆళగిరిని కూడా పార్టీ సమావేశానికి ఆహ్వానించి ఏదో ఒక పదవి అప్పచెబుతారని అనుకున్నారు. అయితే కనిమొళికి, ఆళగిరికి పదవీ బాధ్యతలను ఈ సమావేశంలో అప్పగించలేదు. స్టాలిన్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా...కోశాధికారిగా కొనసాగనున్నారు.

చిన్నమ్మ మంతనాలు....

మరోవైపు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఈరోజు నుంచి పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం, సంక్షేమ కార్యక్రమాల అమలుపై చిన్నమ్మ పార్టీ క్యాడర్ తో చర్చించనున్నారు. మొత్తం మీద తమిళనాడులో శశికళ వర్సెస్ స్టాలిన్ మధ్య పోరు ఏ విధంగా సాగుతుందో చూడాలి మరి.

Similar News