సొంత ఇంటికి పవన్ భూమిపూజ

Update: 2018-03-12 04:05 GMT

పవన్ సొంత ఇంటికి శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా కాజా సమీపంలోని రెండు ఎకరాల్లో కొద్దిసేపటి క్రితం భూమి పూజ చేశారు. ఆయన భార్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా అమరావతికి సమీపంలోనే పవన్ తన సొంత ఇంటి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అదే ప్రాంగణంలో పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించనున్నారు. శంకుస్థాపన తర్వాత పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈ నెల 14వ తేదీన జరగనున్న ప్లీనరీ గురించి చర్చించనున్నారు.

Similar News