సచిన్ రికార్డు బద్ధలవుతుందా?

Update: 2016-10-18 05:02 GMT

క్రికెట్ దేవుడిగా క్రీడాభిమానులు పరిగణించే సచిన్ టెండూల్కర్ చేసిన కొన్ని రికార్డులు ఇప్పట్లో ఎవ్వరూ అధిగమించలేనివి అనిపిస్తుంది. కానీ మరికొన్నిరికార్డులకు మాత్రం కాలదోషం పట్టిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. కాకపోతే.. సచిన్ కు చెందిన రికార్డుల్ని అధిగమించే వారు కూడా మన దేశానికే చెందినవారు కావడం మనకు ఒక గర్వకారణం. ఇప్పుడు వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డును విరాట్ కొహ్లి ప్రస్తుత కివీస్ తో వన్డే సిరీస్ పూర్తయ్యలోగా అధిగమించేస్తాడేమో అనే ఊహాగానాలు క్రీడాభిమానుల్లో సాగుతున్నాయి.

ఆ రికార్డు మరేదో కాదు. వన్డేల్లో హాఫ్ సెంచరీ స్కోర్లు నమోదు చేయడం.

మొత్తం 104 వన్డే ఇన్నింగ్స్ ఆడిన సచిన్ టెండూల్కర్ 34 వన్డేల్లో హాఫ్ సెంచరీ దాటిన స్కోర్లు నమోదు చేసి ఓ రికార్డు సృష్టించాడు. అయితే సచిన్ ను మరపించేంతటి డ్యాషింగ్ బ్యాటింగ్ శైలులతో అభిమానుల్ని ఆకట్టుకుంటూ ఉండే విరాట్ కొహ్లి ఇప్పుడు ఆ రికార్డు భరతం పట్టే వాతావరణం ఉంది.

కివీస్ తో 5 వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలోనే కొహ్లి 85 పరుగులు చేశాడు. దీంతో ఇప్పటిదాకా 70 ఇన్నింగ్స్ లో కొహ్లి చేసిన హాఫ్ సెంచరీ స్కోర్ల సంఖ్య 32 కు చేరుకుంది. అంటే సచిన్ రికార్డుకు ఇంకా కేవలం 2 హాఫ్ సెంచరీల దూరంలోనే ఉన్నాడు. కివీస్ తో ఇంకా నాలుగు వన్డేలున్నాయి. ఏ రెండింటిలో క్లిక్ అయినా సచిన్ రికార్డు బద్దలైపోక తప్పదని క్రీడాభిమానులు అనుకుంటున్నారు.

అయితే నిజానికి సచిన్ 34 హాఫ్ సెంచరీలను 104 ఇన్నింగ్స్ లలో చేస్తే, కొహ్లి 32 హాఫ్ సెంచరీలను కేవలం 70 ఇన్నింగ్స్‌లోనే చేయడం విశేషం. పైగా సచిన్ చాలా వరకు ఓపెనర్ గా వస్తుండే వాడని, కొహ్లి వన్ డౌన్ లో వస్తూ ఈ రికార్డును అధిగమిస్తే గొప్ప విషయమేనని అభిమానులు కోరుకుంటున్నారు.

Similar News