శశికళ నెక్స్ట్ టార్గెట్?

Update: 2016-12-30 14:09 GMT

ఏఐఏడిఎంకే అధినేత్రి శశికళ తదుపరి వ్యూహమేంటి? చిన్నమ్మ మనస్సులో ఏముంది? పోయెస్ గార్డెన్ లో జరుగుతున్నదేమిటి? ఇప్పడు తమిళనాడులో ఇదే చర్చ. మంత్రుల దగ్గర నుంచి సామాన్య కార్యకర్తల వరకూ వేధిస్తున్న ప్రశ్నలివి. జయలలిత నెచ్చెలి శశికళ అతి సునాయాసంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు.

అయితే ఆమె తదుపరి వ్యూహం ఆర్.కె. నగర్. జయలలిత మరణంతో ఆర్.కె.నగర్ కు ఉప ఎన్నిక జరగుతుంది. ఆ ఉప ఎన్నికలో శశికళ పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. పోయెస్ గార్డెన్ ప్రస్తుతానికి ప్రశాంతంగా కన్పిస్తున్నా లోపల మాత్రం సీరియస్ గానే చిన్నమ్మ తన వ్యూహాలకు పదును పెడుతున్నారట. శశి చాలా కసితో ఉన్నారని చెబుతున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కూడా ఏకగ్రీవం అయ్యేల పావులు కదుపుతున్నారట. ఇందుకోసం తంబిదురై తో చిన్నమ్మ ఇప్పటికే మాట్లాడారని..విపక్ష నేతలతో చర్చించే బాధ్యతను ఆయన మీద పెట్టారట శశికళ. ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితం వచ్చిన వెంటనే చిన్నమ్మ చూపు సీఎం కూర్చీ మీద పడక తప్పదంటున్నారు అన్నాడీఎంకే శ్రేణులు. అందుకోసమే ముందు ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టి తర్వాత నింపాదిగా తన స్ట్రాటజీని అమలు చేయబోతున్నారన్నది సమాచారం. ఇందుకు పన్నీరు సెల్వం మంత్రివర్గంలో కొందరు ముఖ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. మొత్తం మీద రాబోయే ఆరు నెలల్లో తమిళనాట రాజకీయం వేడి వేడి సాంబారులా మహా రుచిగా ఉండబోతున్నదన్నమాట.

Similar News