రోజా దెబ్బకు ఆనం బెంబేలు....!

Update: 2018-02-02 13:16 GMT

మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డికి అరెస్ట్ వారెంట్ జారీ అయింది. హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు ఆనం వివేకానందరెడ్డికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆనం వివేకాపై పరువు నష్టం కేసు వేశారు. గతంలో తనపై ఆనం వివేకా చేసిన వ్యాఖ్యలపై ఆమె కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఆనం వివేకాకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో ఆనం వివేకాపై రోజా నాంపల్లి కోర్టులోకూడా కేసు దాఖలు చేశారు. మరి అరెస్ట్ వారెంట్ పై పోలీసుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Similar News