రేపు ఢిల్లీకి అమరావతి రైతులు

Update: 2017-02-05 17:00 GMT

రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. రైతులకు రెండేళ్ల పాటు క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను మినహాయింపు నిచ్చిన కేంద్ర ఆర్ధికశాఖమంత్రి అరుణ్‌జైట్లికి కృతజ్ఞతలు తెలిపేందుకు పలువురు రైతులు సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. సుమారు 60 మంది రైతులతో కూడిన ఈ ప్రతినిధి బృందం సోమవారం రాత్రి గన్నవరం, శంషాబాద్‌ విమానాశ్రయాల నుంచి ఢిల్లీకి వెళ్లేవిధంగా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. రైతులతో పాటు మంత్రులు నారాయణ, పుల్లారావు, తాడికొండ శాసనసభ్యుడు శ్రావణ్‌కుమార్‌ఢిల్లీ వెడుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ విధానంలో భూమిని సేకరించడంపై జైట్లీ బడ్జెట్ సందర్భంగా ప్రశంసించారు. మూల ధన పన్ను మినహాయింపుతో రైతులకు భారీగా లబ్ది కలుగ నుంది.

Similar News