రాజీనామాలకు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

Update: 2018-03-13 07:21 GMT

రాహుల్ నిర్ణయంపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాలు ఆధారపడి ఉన్నాయి. సభలో సస్పెన్షన్ కు గురయిన తర్వాత కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరిగింది.ఇంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. అందుకే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సీఎల్పీ నిర్ణయాన్ని ఏఐసీసీకి తెలియజేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ ఇన్ ఛార్జి కుంతియాకు విషయం తెలియజేశారు. కాని కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు ఈనెల 16, 17 తేదీల్లో ఉండటంతో దానిపై రాహుల్ తో పాటు ఏఐసీసీ నేతలు బిజీగా ఉన్నారు. అందువల్ల కుంతియా ఇంకా రాహుల్ దృష్టికి తీసుకెళ్లలేదని చెబుతున్నారు. తొలుత రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మూకుమ్మడి రాజీనామాలు చేయాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా వచ్చే ఎన్నికలకు రిఫరెండంగా ఉంటాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Similar News