రాజధానిలో మరో కిరాతకుడు

Update: 2017-12-22 02:20 GMT

ప్రేమోన్మాది రెచ్చిపోయాడు .. ప్రేమించిన యువతి దక్కలేదన్న కోపంతో పగ పెంచుకున్నాడు. తన ప్రేమని తిరస్కరించిందన్న కోపంతో రగిలిపోయాడు గతంలో యాసిడ్ సీసాలతో బెదిరించిన పోకిరీలు ఇప్పుడు సీసాలు పట్టుకొని బెదిరిస్తున్నారు. రెండు వందల గ్రాముల పెట్రోల్ తో అమ్మాయిలను కాల్చివేయాలని పగతో రగిలిపోతున్నారు. నడి రోడ్డు పైన దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు ప్రేమోన్మాది. సికింద్రాబాద్ లాలాగూడ ప్రాంతంలో సంధ్యారాణి కుటుంబంలో చిన్నది. కుటుంబ పోషణ సంధ్యారాణి పైనే ఉంది. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులతో కుటుంబాన్ని పోషిస్తుంది. ఇద్దరు సోదరుల పోషణ కూడా సంధ్యారాణి పైనే ఉంది. అక్కల్లో ఒక్కరి వివాహం జరిగిపోయింది తల్లితో పాటుగా సోదరుడు అందరూ కలిసి పని చేసుకొని గడుపుకుంటున్నారు. సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో ఉంటున్న కార్తిక్ కు, సంధ్యారాణికి పరిచయం ఏర్పడింది. తన కుటుంబ పోషణ కష్టంగా ఉందని తనకు ఉద్యోగం ఇప్పించాలని రాణి కార్తిక్ ను కోరింది. దీంతో తాను పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం ఇప్పించాడు కార్తిక్. ఇద్దరూ కలిసి పని చేసేందుకు వెళ్లివచ్చేవారు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. రెండేళ్ల కాలం నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమ వ్యవహారం సంధ్యారాణి ఇంట్లో తెలియదు. సంధ్యను ప్రేమిస్తున్నట్లు గా తన ఇంట్లో చెప్పుకున్నాడు . ఇటీవల కాలంలో కార్తిక్ ప్రవర్తనలో బాగా మార్పొచ్చింది. అంతేకాకుండా తాను చేస్తున్న ఉద్యోగాన్ని కూడా మానేశాడు. మరో కంపెనీలో ఉద్యోగం చేరిపోయాడు.

ప్రేమను నిరాకరించిందని.....

రాణినిహింసించడం మొదలుపెట్టాడు. మీ ప్రవర్తనలో మార్పు రాకపోతే ప్రేమించలేదని కార్తిక్ కు తెగేసి చెప్పింది రాణి. అప్పటికి కూడా కార్తిక్ లో మార్పు రాలేదు. ఇటీవల కాలంలో ఉద్యోగం మానేసి అల్లరి చిల్లరగా తిరగడం మొదలుపెట్టాడు . ఇది సంధ్యా రాణి కి పూర్తిగా నచ్చలేదు. దీంతో నీతో ఉండని రాణి చెప్పింది. అయినప్పటికీ వెంటపడటం మానలేదు. ఉద్యోగం సద్యోగం లేక తిరుగుతున్న కార్తిక్ ను దారిలో పెట్టేందుకు సంధ్యారాణి ప్రయత్నాలు చేసింది అయినప్పటికి కూడా ప్రయత్నాలు ఫలించలేదు. నీతో తెగతెంపులు తీసుకుంటున్నాననికార్తిక్ కు చెప్పింది. మరోవైపు వీరిద్దరూ మంచి గా ఉన్నప్పుడు సెల్ ఫోన్ కొనిచ్చాడు కార్తీక్. ఈ సెల్ ఫోను తన దగ్గరుంటే కార్తిక్ నిత్యం ఫోన్ చేసి వేధిస్తున్నాడని భావించింది సంధ్యారాణి. సెల్ ఫోన్ తను పనిచేస్తున్న కంపెనీ యజమానికి ఇచ్చి కార్తిక్ ఇవ్వాలని చెప్పింది. దీంతో ఆగ్రహించిన కార్తిక్ కంపెనీ నుంచి రాణి బయటికి వస్తున్న తరుణంలోనే నిలదీశాడు. మార్గమధ్యంలో ఇద్దరి మధ్యi ఘర్షణ జరిగింది. తన ప్రేమను ఎందుకు తిరస్కరిస్తున్నావో చెప్పాలని నిలదీశాడు కార్తీక్. రాణి ఇక ప్రేమించలేనని తెగేచి చెప్పింది. దీంతో రెచ్చిపోయిన కార్తిక్ వెంటనే రాణిపై పెట్రోలు పోసి లైటర్ తో వెలిగించాడు. మంటల్లో చిక్కుకున్న రాణిని స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. కార్తీక్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాణి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. కార్తీక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Similar News