రజనీని రాజకీయాల్లో రాకుండా అడ్డుకుంటాం: శరత్ కుమార్

Update: 2017-01-16 04:05 GMT

తమిళనాట మళ్లీ ఫిల్మ్ వార్ మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు కోరుతుంటే సినీనటుడు శరత్ కుమార్ వ్యాఖ్యలు రజనీ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. రజనీని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటామంటూ శరత్ కుమార్ చేసిన ప్రకటనతో తమిళనాడులో తలైవా అభిమానులు శరత్ కుమార్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రజనీని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవడానికి శరత్ ఎవరు అని వారు ప్రశ్నిస్తున్నారు.

జయలలిత మరణంతో తమిళనాట పొలిటికల్ స్సేస్ ఏర్పడింది. దీంతో రజనీని రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులతో పాటు అనేకమంది డిమాండ్ చేస్తున్నారు. అయితే రజనీ మాత్రం దీనిపై ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు. ఆయన మౌనం అర్ధంగీకారంగా భావించిన అభిమానులు సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ డిమాండ్ ను ఉధృతం చేశారు. దీనిపై శరత్ కుమార్ స్పందించడంతో రజనీ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. రజనీ ఇప్పటికైనా స్పందించాలంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు.

Similar News