మూడేళ్ళలో డిజిటల్‌ ఏపీ: చంద్రబాబు

Update: 2016-03-26 17:44 GMT

ఆగస్టు 15 నాటికి ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌ సేవలు అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. మూడేళ్లలో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామన్నారు. రూ.333 కోట్లతో 22500 కి.మీ మేర ఫైబర్‌ గ్రిడ్ లైన్లు వేస్తున్నామని ఆయన తెలిపారు. ఫైబర్‌ గ్రిడ్‌తో పేదల జీవనప్రమాణాలు మెరుగుపడుతాయని చంద్రబాబు వివరించారు. మెరుగైన సేవలు అందించాలంటే టెక్నాలజీ అవసరమన్నారు.రూ.149కే ప్రతి ఇంటికి 10 ఎంబీపీఎస్‌ ఇంటర్నెట్‌, 100 చానళ్లు వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 2018 నాటికి డిజిటల్‌ ఏపీ కలసాకారమవుతుందన్నారు. క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రణాళిక రూపొందిస్తున్నాం..విద్యాసంస్థల్లో వైఫై ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. త్వరలో ఈ-నిధిని ప్రవేశపెడతామన్నారు. సంక్షేమ పథకాలలో అవినీతికి అడ్డుకట్ట వేశామని చంద్రబాబు చెప్పారు.

Similar News