ముస్లింలకు టిక్కెట్లు ఎందుకు ఇవ్వలేదు?

Update: 2017-02-28 07:30 GMT

మోదీ-అమిత్‌ షాల నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో యూపీలో టిక్కెట్ల కేటాయింపుపై ఉమా భారతి విమర్శలు గుప్పించారు. బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు ఇవ్వకుండా తప్పు చేసిందని భాజపా నాయకురాలు, కేంద్రమంత్రి ఉమాభారతి అన్నారు. భాజపా ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు కొన్ని స్థానాలు కేటాయిస్తే బాగుండేదన్న రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలను ఆమె సమర్థించారు. ఈ విషయం గురించి పార్టీ చీఫ్‌ అమిత్‌షాతో మాట్లాడతానని చెప్పారు. యూపీలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలను విస్మరించడం సరికాదన్నారు. ముస్లింలకు, మహిళలకు పార్టీ టికెట్లు కేటాయించేటప్పుడు గెలుపు సామర్థ్యం ప్రాధాన్యం వహిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో యూపీలో ముస్లింలకు భాజపా కనీసం ఒక్క స్థానం కూడా కేటాయించలేదు. ఇది ఎన్నికల ఫలితాలపై గణనీయంగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

ఇవ్వకపోవడమే మంచిది....

అయితే మరో బీజేపీ నేత వినయ్తిఖతియార్ మాత్రం పార్టీ అధిష్టానాన్ని సమర్ధించారు. ముస్లింలు ఎటూ తమకు ఓటెయ్యరని, అలాంటప్పుడు వారికి సీట్లు ఎందుకు ఇవ్వాలని ఖతియార్ ప్రశ్నించారు. ఈ ఐదు దశల ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా గెలవబోరన్నారు. ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వకుండా పార్టీ హైకమాండ్ మంచిపని చేసిందన్నారు ఖతియార్.

Similar News