ముమైత్ బిగ్ బాస్ లో ఉన్నా హాజరవ్వాల్సిందే

Update: 2017-07-21 13:21 GMT

డ్రగ్స్ కేసులో నోటీసు అందుకున్న నటి ముమైత్ ఖాన్ ఈ నెల 27వ తేదీన స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఎదుట హాజరవుతున్నారు. ముమైత్ ఖాన్ ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ షో లో ఉన్నారు. ఆ షో నిబంధనల ప్రకారం 70 రోజుల పాటు బాహ్య ప్రపంచాన్ని చూడకూడదు. బిగ్ హౌస్ లోనే ఉండాలి. అయితే హిందీ బిగ్ బాస్ లో కూడా కొందరి పార్టిసిపెంట్స్ కు కోర్టు నోటీసులు రావడంతో వారు కోర్టుకు హాజరయ్యేందుకు షో నిర్వాహకులు అనుమతిచ్చారు. అలాగే తెలుగు బిగ్ బాస్ షో లో ఉన్న ముమైత్ ఖాన్ కు కూడా నోటీసులు అందాయి. షో నిర్వాహకులు కూడా ముమైత్ ను విచారణకు పంపేందుకు అంగీకరించారు. ముమైత్ ఖాన్ ఈ నెల 27వ తేదీన సిట్ ఎదుట హాజరవుతున్నట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు.

Similar News