ముద్రగడపై ఆంక్షలు ఎత్తివేయాలి

Update: 2017-07-28 01:30 GMT

కాపుల్ని బీసీలలో చేర్చాలంటూ పాదయాత్రకు సిద్ధమైన ముద్రగడ పద్మనాభంను హౌస్ అరెస్ట్ చేసిన నేపధ్యంలో ఏపి డిజిపి సాంబ శివరావుతో కాపు న్యాయవాదుల జెఎసి సమావేశమైంది. ముద్రగడను గృహ నిర్బంధంలో ఉంచడం చట్ట వ్యతిరేకమని., పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలకడం సిగ్గుచేటని న్యాయవాదులు ఆరోపించారు. న్యాయవాదులు ఎక్కడికైనా వెళ్ళవచ్చు..ఎవరినైనా కలవవచ్చని .పోలీసులు ఆంక్షలు విధించడంపై డిజిపిని కోరగా అడ్వకేట్స్‌ ఎక్కడికైనా వెళ్ళవచ్చని న్యాయవాదులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నామని ప్రకటించారు. ముద్రగడ పాదయాత్ర చేస్తే విధ్వంసానికి పాల్పడరు...శాంతియుతంగానే చేస్తారు..అనవసరంగా పాదయాత్రను అడ్డుకోవడం చట్టాలను ఉల్లంఘించడమేని న్యాయవాదులు ఆరోపించారు. ముద్రగడ హౌస్ అరెస్ట్ ఎత్తివేస్తామని డిజిపి హామీ ఇచ్చారని జేఏసీ ప్రకటించింది. జిల్లాల్లో సమావేశాలు, పాదయాత్రలు చేసుకోవచ్చని డీజీపీ చెప్పారని రేపు మరోమారు డిజిపి ని కలుస్తామని న్యాయవాదులు చెప్పారు.

Similar News