మంత్రిపై ఈసీ వేటు

Update: 2017-07-17 03:40 GMT

2008 ఎన్నికల్లో ఎన్నికల వ్యయంపై లెక్కలు చెప్పకపోవడం., చెల్లింపు వార్తల ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రిని రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన కూడదంటూ ఈసీ ఉత్తర్వులిచ్చింది. మధ్య ప్రదేశ్‌ జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నరోత్తమ్‌ మిశ్రా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ 2008లో కేసు నమోదు అయ్యింది. పరిమితికి మించి ఖర్చు చేయడం., లెక్కలు చూపకపోవడం., చెల్లింపు వార్తల అభియోగాలతో మూడేళ్ల పాటు ఆయనపై నిషేధం విధిస్తూ ఈ ఏడాది జూన్‌ 24న ఉత్తర్వులు జారీ చేసింది. 2013 ఎన్నికల్లో కూడా పోటీ చేసి గెలిచిన మిశ్రా., ఈసీ ఉత్తర్వులతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు కోల్పోయారు. ఆయనకు బ్యాలెట్‌ పేపర్‌ కూడా పంపడం లేదని ఈసీ ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులపై నరోత్తమ్ ఢిల్లీ హైకోర్టులో ఆదివారం అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసినా ఆయనకు ఊరట దక్కలేదు.

Similar News